100 శాతం టీడీపీ విజయం సాధిస్తుంది: చంద్రబాబు (వీడియో)

1050చూసినవారు
ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ 'ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారన్నారు. 100 శాతం టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.