అంతరిక్షంలో 1000 రోజులు.. రష్యా వ్యోమగామి రికార్డు

66చూసినవారు
అంతరిక్షంలో 1000 రోజులు.. రష్యా వ్యోమగామి రికార్డు
రష్యాకు చెందిన వ్యోమగామి ఒలెగ్ కొనోనెంకో.. కొత్త రికార్డు సృష్టించారు. రోదసిలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 2008 నుంచి ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి ఐదుసార్లు యాత్ర నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబరు 15 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. సెప్టెంబరు 23 వరకూ ఐఎస్ఎస్‌లోనే ఉంటారు. అప్పటికి ఆయన 1,110 రోజులు రోదసిలో గడిపినట్లవుతుంది.

సంబంధిత పోస్ట్