10th ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు

76చూసినవారు
10th ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. రెగ్యులర్/ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇకపై ఫీజు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాను ఈ నెల 24లోగా డీఈఓలకు సమర్పించాలని పేర్కొంది. వాటిని డీఈఓలు ఈ నెల 25లోగా తమకు పంపాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్