తెలంగాణ బీసీ జాబితాలో 130 కులాలు: బీసీ కమిషన్‌ ఛైర్మన్‌

67చూసినవారు
తెలంగాణ బీసీ జాబితాలో 130 కులాలు: బీసీ కమిషన్‌ ఛైర్మన్‌
తెలంగాణ బీసీ జాబితాలో 130 కులాలు ఉన్నాయని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. బహిరంగ విచారణలో అందిన వినతులపై రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్ శుక్రవారం సమీక్ష చేపట్టారు. రాష్ట్ర బీసీ జాబితాలోని 40 కులాలను ఓబీసీలుగా గుర్తించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఓబీసీల్లో 90 కులాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పలు కులాల పేర్ల మార్పునకు ప్రజాభిప్రాయం సేకరించాలని కమిషన్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్