పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి (వీడియో)

3345చూసినవారు
పాకిస్థాన్‌లో ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, వధువు ప్రాణాలతో బయటపడింది. గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 25 మందితో వెళ్తున్న బస్సు ఓ వంపు వద్ద అదుపుతప్పి నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మరో 10 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్