రాజస్థాన్‌లోని ఉన్న రణతంబోర్ నేషనల్ పార్క్ జోన్ 8లోకి వాహనాల ద్వారా ప్రజలకు అనుమతి లేదు. అయితే అక్రమంగా ఓ 14 మంది SUV యజమానులు పార్క్ లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో అధికారులు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష జరిమానా విధించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ నుంచి ఈ వాహనాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అడ్వెంచర్ ర్యాలీ సందర్భంగా వారు టైగర్ రిజర్వ్‌లోని నిషేధిత జోన్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.