రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో గురువారం దారుణం ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువకులు బాలికను గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత నిందితులు భయంతో పరారయ్యారు. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితురాలి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.