పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. జిల్లాకేంద్రంలోని ఓ చౌరస్తాలో చిలుకూరి క్లాత్ స్టోర్ బ్రదర్స్ కుటుంబ సభ్యులు బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక, దుకాణం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బ్యాంకు అధికారుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.