పిఠాపురంలో శుక్రవారం జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, త్రిభాషా విధానం, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు, గోధ్రా మారణహోమంపై పవన్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.