AP: చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త రామకృష్ణ (55), కుమారుడు సురేశ్ (25)పై గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ వెంకటరమణ కొడవలితో దాడి చేశాడు. గాయపడిన తండ్రి, కుమారుడిని మదనపల్లెలోని ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన సురేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.