వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. నగరంలోని చౌరస్తాలో ఉన్న తమ షాపు ముందు నలుగురు కుటుంబసభ్యులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్ల వేధింపులతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.