ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 154 మంది మావోయిస్టులు మరణించారు. ఇవాళ దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోాయిన విషయం తెలిసిందే. కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 29న నారాయణపుర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.