ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు గత 3 రోజుల్లో 30 మందికి పైగా చనిపోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. విజయవాడతో సహా వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని వారు కేంద్రాన్ని కోరారు.