16 నెలల బాలికను ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

66చూసినవారు
ఆడుకుంటున్న 16 నెలల చిన్నారిని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో ఆ బాలిక మృతి చెందింది. యూపీలోని ఆగ్రాలో ఉన్న కాస్మాస్ మాల్ పార్కింగ్ స్థలంలో ఈ ఘటన జరిగింది. తాజ్‌గంజ్‌లోని బాబ్రీ గుమ్మట్‌ కు చెందిన జైదీప్‌ తన భార్య శివాని, కుమార్తె రుద్రిక, కుమారుడు క్రిషబ్ ఠాకూర్ తో కలిసి షాపింగ్ కు వెళ్లారు. షాపింగ్ అనంతరం పార్కింగ్ స్థలంలో రుద్రిక ఆడుకుంటుండగా ఓ కారు ఢీకొట్టి, ఆమెపై నుంచి వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్