EPFOలో జూన్‌లో కొత్తగా చేరిన 19.29 లక్షల మంది

58చూసినవారు
EPFOలో జూన్‌లో కొత్తగా చేరిన 19.29 లక్షల మంది
కేంద్ర కార్మిక శాఖ EPFOలో జూన్‌లో కొత్తగా చేరిన వారిపై తాజాగా నివేదిక విడుదల చేసింది. కొత్తగా జూన్ నెలలో 19.29 లక్షల మంది చేరారని వెల్లడించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ప్రస్తుతం 7.86% వృద్ధి నమోదు అయినట్లు వివరించింది. యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. ఇక కొత్తగా తొలిసారి ఉద్యోగం పొందిన వారిలో 59.14 శాతం మంది 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారే ఉన్నారని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్