ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ఫైబర్‌లో మరో 2 కొత్త ప్లాన్లు

66చూసినవారు
ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ఫైబర్‌లో మరో 2 కొత్త ప్లాన్లు
భారతీ ఎయిర్‌టెల్‌ తమ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ కస్టమర్ల కోసం మరో 2 కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. వీటి ధర నెలకు రూ.699, రూ.999 గా నిర్ణయించింది. వీటిలో 350 లైవ్‌ టీవీ ఛానెళ్లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే యాక్సెస్‌ లభిస్తుంది.ఈ ప్లాన్లలో ఏది తీసుకున్నా 4కే ఆండ్రాయిడ్‌ సెటప్ బాక్స్‌ వస్తుంది. వేగవంతమైన వైర్‌లెస్‌ 5జీ ఇంటర్నెట్‌ సేవల కోసం ఎయిర్‌టెల్‌ గత ఏడాది ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్