తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలపి మొత్తం 39,188 ప్రసవాలు జరిగాయి. ఇందులో 22,046 డెలివరీలు సిజేరియన్లు. ఈ లెక్కన ప్రతీ గంటకు 29, రోజుకు సగటున 711 కడుపుకోతలు జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు కేవలం 43.75 శాతంగా నమోదయ్యాయి. అత్యధిక సిజేరియన్లు జరిగిన జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచింది.