రంగంలోకి 300 మంది మిలట్రీ సిబ్బంది!

52చూసినవారు
రంగంలోకి 300 మంది మిలట్రీ సిబ్బంది!
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో సహాయక చర్యలకు కేంద్రం సిద్దమైంది. 300 మంది సిబ్బందితో భారత ఆర్మీ బలగాలను వెంటనే రంగంలోకి దింపినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్‌లో తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అదనపు ఆర్మీ బలగాలు, నేవీ సిబ్బంది, వాయిసేన హెలికాప్టర్లను సమీకరించామని చెప్పారు. భారీ ఇంజనీరింగ్ సామాగ్రి, డాగ్ టీమ్‌లు, నిత్యావసరాలను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా పంపిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత పోస్ట్