8 నెలల్లో 32 లక్షల మలేరియా కేసులు..!

66చూసినవారు
8 నెలల్లో 32 లక్షల మలేరియా కేసులు..!
ఆఫ్రికన్‌ దేశాలను దోమలు వణికిస్తున్నాయి. దోమలతో సంక్రమించే వ్యాధులతో ఏటా లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గత కొద్ది నెలల్లో ఇథియోపియాలో మలేరియాతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. కేవలం ఎనిమిది నెలల్లో 32 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మలేరియా వేగంగా వ్యాప్తి చెందుతోందని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇక్కడ ప్రతివారం 70వేల వరకు కేసులు రికార్డవుతున్నాయి.

సంబంధిత పోస్ట్