బెంగాల్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

64చూసినవారు
బెంగాల్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
సందేశ్‌ఖాలీ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటన అత్యంత సిగ్గుచేటని పేర్కొంది. సందేశ్‌ఖాలీ హింసపై దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. సందేశ్‌ఖాళీ భూఆక్రమణ, లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అఫిడవిట్‌లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్