ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్ క్లీన్ స్వీప్ చేయడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసీస్ బ్యాటర్లలో ఒక్కరు డబుల్ సెంచరీ చేసినా ఆ జట్టు పుంజుకుంటుందని పేర్కొన్నారు. గతంలో ద్రావిడ్, లక్ష్మణ్ చేసిన మ్యాజిక్‌ను చేయగలిగే ఆటగాళ్లు ఆసీస్ వద్ద కూడా ఉన్నారని చెప్పాడు. 'ఇప్పుడే భారత జట్టు 4-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పలేం. వాళ్ల దగ్గర స్టీవ్ స్మిత్, లబూషేన్, ఉస్మాన్ ఖవాజా వంటి బ్యాటర్లు ఉన్నారు. వారిపైనే ఆస్ట్రేలియా విజయం ఆధారపడి ఉంటుంది' అని గంభీర్ వివరించాడు.