వృద్దులకు ఆదాయ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. పదవీ విరమణ అనంతర జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా అటల్ పెన్షన్ యోజన స్కీంను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరడానికి 18-40 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులు. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు కంట్రిబ్యూట్ చేస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.1000 నుంచి రూ.5వేల వరకు పింఛన్ పొందొచ్చు.