ఆర్థిక విజయాన్ని సాధించాలంటే పాటించాల్సిన ఆరు సూత్రాల్ని తాజాగా హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆ టిప్స్ ఏంటంటే..1. ఆదాయాన్ని సృష్టించే ఆస్తులు కూడగట్టుకోండి.
2. సంపాదన కన్నా తక్కువ ఖర్చు చేయండి.
3. ఆదాయాన్ని మాత్రమే కాదు.. సంపదను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి.
4. ఆర్థిక అక్షరాస్యత పెంచుకోండి.
5. సంపద సృష్టించే అవకాశాల కోసం అన్వేషించండి.
6. డబ్బు కోసమే కాకుండా నేర్చుకొనేందుకు పని చేయండి.