పాకిస్థాన్ దేశం దాడులు, రైలు హైజాక్ లాంటి ఘటనలతో ప్రస్తుతం అట్టుడికిపోతోంది. ఇటీవల ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం పాకిస్థాన్ గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్‌లో ప్రార్థనల సమయంలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇస్లామిస్ట్ నాయకుడు, పిల్లలతో సహా ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.