AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి పోలీసులు శుక్రవారం భారీ షాక్ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పోలేపల్లిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రకాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా వెళ్లడానికి వీలు కాదని పోలీసులు స్పష్టం చేయగా వారితో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.