సెంట్రలో నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో కొంతమంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌లోకి పెట్రోల్ పంప్ చేస్తున్న క్రమంలో ఓ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నయని నైజీరియా అత్యవసర ప్రతిస్పందన ఏజెన్సీ వెల్లడించింది.