మహారాష్ట్రలోని పుణెలో గత రెండు నెలల్లో 66 జికా వైరస్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు బుధవారం వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 26 మంది గర్భిణులు సైతం ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. నలుగురు వ్యక్తులు వైరస్ బారిన పడి మరణించారు. ఈ నలుగురు రోగులు 68 నుంచి 78 మధ్య వయసు గలవారేనని అధికారులు స్పష్టం చేశారు. మరణించిన వారికి గుండె సంబంధిత వ్యాధులు, కాలేయం, వృద్ధాప్య సమస్యలు ఉన్నాయని తెలిపారు.