భూమ్మీద నూకలుంటే.. ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో నాగౌర్‌లోని హైవేపై శుక్రవారం రాత్రి జరిగింది. ఓ కారు అతివేగంగా వచ్చి ఎనిమిది పల్టీలు కొట్టి ఓ దుకాణం గేటుపై పడి ఆగిపోయింది. అయితే ప్రమాదసమయంలో కారులో ఐదుగురు ఉండగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా వైరల్‌గా మారాయి.