వృద్ధుడి కడుపులో 15 సెంటీమీటర్ల వేప కొమ్మ.. సర్జరీ చేసిన డాక్టర్లు

72చూసినవారు
వృద్ధుడి కడుపులో 15 సెంటీమీటర్ల వేప కొమ్మ.. సర్జరీ చేసిన డాక్టర్లు
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. హిమ్మత్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి కడుపునొప్పితో జెనాజీ మక్వానా అనే 65 ఏళ్ల వృద్ధుడు వచ్చాడు. వైద్యులు CT స్కాన్, ఎక్స్‌రే తీశారు. అతడి కడుపులో వేపకొమ్మ ఉన్నట్లు గుర్తించారు. అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. అతడి కడుపులో నుంచి 15 సెంటీమీటర్ల వేపకొమ్మను బయటకు తీశారు. ప్రస్తుతం జెనాజీ ఐసీయూలో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్