భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత బజరంగ్ పునియాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. హరియాణా ఎన్నికల వేళ హస్తం పార్టీలో చేరిన ఆయనను కాంగ్రెస్ నుంచి వైదొలగాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై సోనిపత్‌లోని బహాల్‌ఘఢ్ పోలీస్ స్టేషన్‌లో పునియా ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పోలీసులు స్పందిస్తూ.. ఈ విషయం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని తెలిపారు.