డెంగ్యూ జ్వరంతో 16 ఏళ్ళ బాలిక మృతి

81చూసినవారు
డెంగ్యూ జ్వరంతో 16 ఏళ్ళ బాలిక మృతి
తెలంగాణలోని కొమరంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిర్పూర్ (టీ)మండలంలోని వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన దంద్రే కుషాబ్ రావ్, తిషాల దంపతులకు చెందిన గంగోత్రి(16)కి సోమవారం రాత్రి డెంగ్యూ జ్వరం రావడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. డెంగ్యూ జ్వరాలపై వైద్యశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్