డెంగీని అంటువ్యాధిగా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

63చూసినవారు
డెంగీని అంటువ్యాధిగా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. డెంగీని అంటువ్యాధిగా ప్రకటించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ మేరకు దోమల వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది 5,000 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 24,500 కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్