రెండు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్నేయాసియా దేశమైన బ్రూనై చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ఘనస్వాగతం పలికారు. బ్రూనే దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. భారత్-బ్రూనే మధ్య దౌత్య సంబంధాలు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన సాగిస్తున్నారు.