వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసే పనిలో రెస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి. కేరళలో ఇంతటి విషాదాన్ని నింపిన ఈ ప్రమాదంలో 40 రోజుల నవజాత శిశువు సురక్షితంగా బయటపడింది. చూరల్‌మల్‌లో ప్రకృతి విధ్వంసానికి అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. కానీ ఓ ఇంటిలో ఉన్న 40 రోజుల నవజాత శిశువును, తల్లిని సురక్షితంగా కాపాడింది.