ఆహారం కోసం వెతుకుతున్న పులికి ఎదురైన ఎలుగుబంటి.. తర్వాత ఏమైందంటే

75చూసినవారు
ఇటీవల సఫారీ టూర్ కు వెళ్ళిన ఓ బృందానికి ఆసక్తికర ఘటన ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియోను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ గుప్తా షేర్ చేశారు. వీడియోలో ఓ పులి ఆహారం కోసం వెతుకుతోంది. ఆ సమయంలో ఓ ఎలుగుబంటి పులికి ఎదురైంది. ఆ ఎలుగును చూసిన పులి వెంటనే నక్కింది. ఆ ఎలుగు పోయిన తర్వాత పులి పైకి లేచి అది వెళ్లిన మార్గం వద్దకు వెళ్ళింది. అకస్మాత్తుగా బయటకు వచ్చిన ఎలుగు.. పులి మీద దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్