కూటమిలో కుమ్ములాటలు

60చూసినవారు
కూటమిలో కుమ్ములాటలు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్తున్న కూటమిలో రచ్చ మొదలైంది. ఎవరికి వారే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ప్రచార సమయంలోనే వీరి మధ్య రగడ బయట పడిపోతోంది. కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. టీడీపీలోనే వర్గపోరు కొనసాగుతుంటే, అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య కూడా ఆధిపత్యపోరు నడుస్తోంది. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న వేళ కూటమిలో కుమ్ములాటలు మూడు పార్టీల అగ్రనేతలకు తలనొప్పిగా తయారయ్యాయి.

సంబంధిత పోస్ట్