మార్పు కావాలి.. అని పెద్ద మార్పే తెచ్చారు: కేటీఆర్‌

69చూసినవారు
మార్పు కావాలి.. అని పెద్ద మార్పే తెచ్చారు: కేటీఆర్‌
మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తెచ్చారని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఆనాటి కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు. నేడు బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు' అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఘటనలపై స్పందిస్తూ.. విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? అని ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్‌ సర్కారు కళ్లు తెరవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్