FRIENDSHIP DAY: ప్రతి ఒక్కరిలో లోపాలుంటాయి. మంచీచెడులుంటాయి. ఫ్రెండ్‌లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. ఆ లోపాలు వదిలి మనవాళ్లలో సానుకూలతలు చూడగలిగినప్పుడే అనుబంధాలు దృఢమవుతాయి. ఒకే కంచంలో తినేంత దగ్గరితనం ఉన్నా ప్రతి ఒక్కరికీ ఓ వ్యక్తిగతమైన పరిధి ఉంటుంది. తను నాకు క్లోజ్ అంటూ ఆ పరిధులు దాటి వెళ్లొద్దు. అడక్కముందే అతిగా సలహాలివ్వడమూ అంత మంచిదేం కాదు.