రాణించిన SRH.. రాజస్థాన్‌ లక్ష్యం 176

562చూసినవారు
రాణించిన SRH.. రాజస్థాన్‌ లక్ష్యం 176
రాజస్థాన్‌తో జరుగుతున్న క్యాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్లాసెన్‌(50) అర్ధ శతకంతో రాణించాడు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (12) ట్రావిస్‌ హెడ్‌ (34) పరుగులు చేసి వెనుదిరిగారు. రాహుల్ త్రిపాఠి (37), షాబాజ్‌(18) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, అవేశ్‌ ఖాన్‌ తలో మూడు వికెట్లు.. సందీప్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.

సంబంధిత పోస్ట్