AP: బాపట్ల జిల్లా రేపల్లె మండలం కామరాజుగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పటడంతో 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రేపల్లె, తెనాలి ఆసుపత్రులకు తరలించారు. బాధితులను కొల్లిపర మండలం దావులూరు వాసులుగా గుర్తించారు. బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది.