ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంటిని కబ్జా చేశారని హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్ బండ్ల గణేష్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంటిని విడిచిపెట్టాలని ఫిబ్రవరి 15న గణేష్ ఇంటికి వెళ్లగా తనను నిర్భంధించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు గణేష్ పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.