మోసగాళ్లకే మోసగాడు.. స్కామర్‌నే బురిడీ కొట్టించిన యువకుడు

78చూసినవారు
మోసగాళ్లకే మోసగాడు.. స్కామర్‌నే బురిడీ కొట్టించిన యువకుడు
యూపీలోని కాన్పూర్‌కు చెందిన భూపేంద్ర సింగ్‌ అనే యువకుడికి సీబీఐ అధికారిగా నటిస్తూ ఓ స్కామర్ కాల్ చేశాడు. అభ్యంతరకర వీడియోల కేసు మూసివేయాలంటే రూ.16,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇది స్కామ్‌ అని అర్థం చేసుకున్న భూపేంద్ర, బంగారం తాకట్టు పెట్టానని అది విడిపించి డబ్బులు ఇస్తానని నటిస్తూ స్కామర్‌ నుంచే రూ.10,000 తీసుకున్నాడు. చివరికి నేరగాడు బ్రతిమాలగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బును విరాళంగా ఇచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్