విద్యాహక్కు చట్టం వస్తే మన విద్యా సంస్థలకు సకల సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వాలు చెప్పాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చి 14 ఏళ్లు పూర్తయింది. అయినా పాఠశాలల్లో ఎటువంటి మార్పులు జరగలేదు. మూత్రశాలల సౌకర్యం మెరుగుపడలేదు. పాలకులకి ఓట్లు రాల్చే పథకాల పైన ఉన్న ప్రేమ బాలికల విద్యా భవిష్యత్తుపై లేకపోవడం దురదృష్టకరం. తమ సమస్యల పరిష్కారం కోసం అక్కడక్కడ విద్యార్థినులు రోడ్డుపైకి వస్తున్నారు. అలా కాకుండా అందరూ కదిలితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.