ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్ సౌకర్యం కల్పించని రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. యూడీఐఎస్ఈ డేటా 2022 ప్రకారం తెలంగాణలోని 21 శాతానికి పైగా అంటే.. 8980 పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్లు లేవని తేలింది. దేశవ్యాప్తంగా 14.77 లక్షల స్కూళ్లు ఉంటే అందులో 13.98 లక్షల స్కూళ్లలో మాత్రమే బాలికల కోసం మరుగుదొడ్ల సౌకర్యాలున్నాయి. బాలికలకు మరుగుదొడ్లు లేని పాఠశాలలున్న రాష్ట్రాల్లో 31.2 శాతంతో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.