మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడు జీవితం.. ది గోట్ లైఫ్'కు అవార్డుల పంట పండింది. 2023 సంవత్సరానికి గానూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డుల్లో ఉత్తమ నటుడు(పృథ్వీరాజ్), ఉత్తమ దర్శకుడు(బ్లెస్సీ), ఉత్తమ పాపులర్ ఫిల్మ్ సహా 8 అవార్డులను దక్కించుకుంది. కాగా, గల్ఫ్ వెళ్లి అక్కడ చిక్కుకున్న మలయాళీ వలసదారుడి నిజ జీవిత కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.