చెట్టు మీద నక్కిన భారీ కింగ్ కోబ్రా (Video)

578చూసినవారు
కర్ణాటకలోని అగుంబే అడవికి సమీపంలోని ఓ గ్రామంలో 12 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. అడవినుంచి బయటకు వచ్చిన భారీ కింగ్ కోబ్రా.. రోడ్డుకు పక్కనే ఉన్న ఓ ఇంటి సమీపంలోకి వచ్చి చెట్టుమీద ఎక్కి కూర్చుంది. అది గమనించిన స్థానికులు భయంతో వణికిపోయారు. స్నేక్‌ క్యాచర్‌, అటవీశాఖ అధికారులు, ఏఆర్ఆర్ఎస్ బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పామును పట్టుకుని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్