AP: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా అరకు లోయలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. జి.మాడుగులలో 4.1, డుంబ్రిగూడలో 6, జీకే వీధిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితో పాటు ఉ.10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. బుధవారం నుంచి చలి స్వల్పంగా తగ్గే ఛాన్సుందని వాతావరణ శాఖ వెల్లడించింది.