ఆకాశంలో రాకాసి ఉల్క.. ఆశ్చర్యంలో ప్రజలు

53చూసినవారు
ఆకాశంలో రాకాసి ఉల్క.. ఆశ్చర్యంలో ప్రజలు
స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఓ భారీ ఉల్క కాంతులు వేదజల్లుతూ భూమిని తాకింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. దాని కాంతికి రాత్రి కూడా పట్టపగలును తలపించింది. ఇది ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ ఉల్క వెలుగు కొన్ని వందల కి.మీ. దూరం కనిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉల్క ఎక్కడ నేలను తాకిందనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

సంబంధిత పోస్ట్