ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఆప్‌కు చెందిన నలుగురు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఇద్దరు కౌన్సిలర్‌లు రేఖా రాణి, శిల్పా కౌర్ ఉన్నారు. మిగతా ఇద్దరిలో ఆప్ మాజీ ఎమ్మెల్యే శ్రీదత్ శర్మ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు పార్లమెంటరీ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఛౌదరి విజేంద్ర ఉన్నారు.