అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. విడుదలై వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అమెరికాలోనూ ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ 2.3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్‌కు క్యూ కడుతున్నారు.